రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేటలోని రైతువేదికలో సోమవారం 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, రూ.15 లక్షల విలువైన సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సింగిల్‌విండో ఎరువుల గోదాంను ప్రారంభించి మాట్లాడారు. సహకార సంఘాలు రైతులకు తమవంతు సేవ చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే రైతు రుణమాఫీ చేశామన్నారు. సన్నరకాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.10వేల రైతుబంధు ఇచ్చిందని, తమ ప్రభుత్వం రూ.12వేలకు పెంచినట్లు తెలిపారు. ఈనెల 26న అందజేయనున్నట్లు ప్రకటించారు. సింగిల్‌విండో చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రాంమోహనన్‌రావు, వైస్‌చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment