పెండింగ్ పనులు పూర్తి చేయండి
వేములవాడ: ఐదేళ్లుగా తమ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అధికారులను కోరారు. చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. ఏఈ నర్సింహాస్వామి ఎజెండాలోని 49 అంశాలు, టేబుల్‌లోని 8 అంశాలను చదివి వినిపించారు. అనంతరం ఒక్కో అంశంపై చర్చించి అన్నింటికీ ఆమోదం తెలిపినట్లు కమిషనర్ అన్వేశ్ ప్రకటించారు. 2017లో ప్రతిపాదనలు చేసిన రూ.20కోట్ల పనుల్లో 98శాతం పూర్తి చేసేందుకు సహకరించిన అధికారులకు కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. శివారు కాలనీల్లో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 27తో సభ్యుల పదవీకాలం ముగియనుంది. వైస్‌చైర్మన్ బింగి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment