నేషనల్ హైవే రూట్‌మ్యాప్ మార్చండి
● సిరిసిల్ల పట్టణం అవతలి నుంచి వేయాలి ● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ● సాదాసీదాగా కౌన్సిల్ మీటింగ్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం గుండా రానున్న నేషనల్ హైవే అలాట్‌మెంట్ రూట్‌మ్యాప్ మార్చి శివారు అవతల నుంచి కొత్తగా రూట్‌మ్యాప్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ కోరింది. పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం కౌన్సిల్ ప్రాధాన్యతనిస్తూ సోమవారం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌హాలులో చైర్‌పర్సన్ జిందం కళ అధ్యక్షతన 31 అంశాలతో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, అన్ని అంశాలు ఆమోదించారు. సమావేశం అనంతరం చైర్‌పర్సన్ చాంబర్‌లో ప్రెస్‌మీట్లో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో పట్టణాభివృద్ధి, పారిశుధ్యం, పార్కుల నిర్వహణ, జంక్షన్‌ల అభివృద్ధి, హరితహారం నిర్వహణపై ఆమోదం పొందినట్లు తెలిపారు. స్లీపింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, ఆటోలకు మరమ్మతులు చేసందుకు సొంత వర్క్‌షాప్ ఏర్పాటుకు రూ.15లక్షలు కేటాయించేందుకు తీర్మానించినట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్ల, డ్రెయినేజీలకు ప్రత్యేక నిధులు కేటాయించుకోవడం, నేషనల్ హైవే 365–బీ రోడ్డు రూట్‌మ్యాప్‌ను మొదటి బైపాస్‌రోడ్డు మీదగా కాకుండ పట్టణ శివారు ప్రాంతాలను తాకుతూ కరకట్టమీదుగా నర్సింగ్ కాలేజీ, జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్ ఆఫీస్ అవతల ప్రాంతాల నుంచి వెళ్లేలా రోడ్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ డి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment