పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లటౌన్/ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్, పోతుగల్ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను సర్వే చేపట్టినట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. అర్హులను గుర్తించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీడీవో బీరయ్య, ఎంపీవో నరేశ్, ఈవో రమేశ్, సిబ్బంది ఉన్నారు.
పాఠశాల తనిఖీ
తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠాలు బోధిస్తున్న విధానం తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ సందర్శన
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సేవలు, సిబ్బంది వివరాలు మున్సిపల్ మేనేజర్ మీర్జా ఫసహత్ అలీబేగ్‌ను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ డీఈ భాస్కర్, డీఎల్ పీవో నరేశ్, ఎంపీవో బీరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment