వైద్య ఆరోగ్య అధికారిగా రజిత
సిరిసిల్లకల్చరల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ రజిత నియమితులయ్యారు. అదనపు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ వసంత్‌రావు స్థానంలో రజిత బాధ్యతలు తీసుకున్నారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన ఆమె కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు.
పెండింగ్ స్కాలర్‌షిప్ మంజూరు చేయండి
● ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
చందుర్తి(వేములవాడ): విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కోరారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ సభ్యత్వ నమోదులో పాల్గొని మాట్లాడారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కోరారు. స్థానిక కాలేజీకి రోడ్డు నిర్మాణానికి మూడు నెలల క్రితం భూమిపూజ చేసి పనులు మరిచిపోయారన్నారు. ఆర్వోఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. వేములవాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సామల్ల సాయిభరత్, కడారి శివ పాల్గొన్నారు.
రైసుమిల్లులు తనిఖీ
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని లింగన్నపేట, కొత్తపల్లి గ్రామాల్లోని రైసుమిల్లులను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ శనివారం పరిశీలించారు. 2022–23 సీజన్‌కు చెందిన వేలం వేసిన ధాన్యాన్ని తనిఖీ చేశారు. యాసంగి ధాన్యం కాంట్రాక్టర్‌లకు ఈనెల 31లోపు అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నవీన్, మండల తహసీల్దార్ భూపతి ఉన్నారు.
హద్దురాళ్ల తొలగింపు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొలనూర్‌లో కబ్జాకు గురవుతున్న కుమ్మరికుంటలో అధికారులు హద్దురాళ్లు తొలగించారు. ‘కుమ్మరికుంట కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ అధికారులు హద్దురాళ్లను సిబ్బందితో తొలగింపజేశారు. చెరువు భూమిని ఎవరూ ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
వరల్డ్ మెడిటేషన్ డే
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో శనివారం స్థానిక రగుడులోని ఐఎంఏ హాల్‌లో ధ్యాన దినోత్సవం నిర్వహించారు. హార్ట్‌ఫుల్ నెస్ జిల్లా కోఆర్డినేటర్ కోడం సతీశ్ ధ్యానం ద్వారా కలిగే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, శ్రీరామచంద్ర మిషన్ బాధ్యులు, డాక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment