మిషన్ మ్యాథమేటిక్స్
ఇల్లంతకుంట(సిరిసిల్ల): గణితం అంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, సబ్జెక్టును ఇష్టంగా నేర్చుకోవడానికి మిషన్ మ్యాథమేటిక్స్ అనే కాన్సెప్ట్‌తో ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇల్లంతకుంట మండలం అనంతగిరి హైస్కూల్ మ్యాథ్స్ టీచర్ ఫరీదుద్దీన్. కరోనా సమయంలో పదోతరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని మ్యాథ్స్ టీచర్లతో గ్రూపు నిర్వహిస్తున్నారు. భరోసా మ్యాథ్స్ విజార్డ్ సంస్థ నిర్వహించిన గణిత కాన్సెప్ట్ వీడియో కాంపిటీషన్‌లో ఈ పాఠశాల విద్యార్థులు రక్షిత, అక్షిత జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment