పరమేశ్వరా.. పాహిమాం
వేములవాడ: వరుస సెలవులు, వీకెండ్‌తో రాజన్నకు భక్తుల రద్దీ పెరిగింది. శనివారం 25 వేల మంది దర్శించుకున్నారు. ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె, అభిషేకాలు, అన్నపూజ, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనెపోసి గండాలు తొలగిపోవాలని మొక్కుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం సమర్పించారు. భక్తుల ఏర్పాట్లను ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, జయకుమారి పర్యవేక్షించారు. రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో శనిత్రయోదశి పూజలు చేశారు. భక్తులు భారీగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment