సీఎం మాస్క్‌లతో ర్యాలీ..నిరసన
సిరిసిల్లకల్చరల్/వేములవాడరూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్ష చేస్తున్న స మగ్ర శిక్షా ఉద్యోగులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ మాస్కులు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ సర్కిల్ నుంచి రగుడు అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.
విప్‌ను కలిసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు
డిమాండ్లు నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిశారు. సానుకూలంగా స్పందించిన విప్ ఆది శ్రీనివాస్ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ స్వప్న, భవిత సెంటర్ నిర్వాహకురాలు కత్తి జయలక్ష్మి, సీఆర్‌పీ నగేశ్, సంతోష్, ఎస్‌వో లింగవ్వ, కల్పన, సంతోషి, శ్యామల, నీరజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment