ఆరోగ్య దారి
సైకిల్ సవారీ..
చురుగ్గా.. ఆరోగ్యంగా
కరీంనగర్ మండలంలోని నగునూరు ప్రతిమ ఆస్పత్రి వైద్యులు తమ ఆరోగ్య రక్షణలో భాగంగా సైక్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండె వైద్య నిపుణుడు కె.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు సంజీవ్, మానస ఫుఖాన్‌ల బృందం ప్రతీరోజు 20 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేస్తున్నారు. ఆదివారం ప్రత్యేకంగా 40 కిలోమీటర్లు వెళ్తామని, సైక్లింగ్ వల్లే కోవిడ్ సమయంలో ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. సహచర వైద్యులతో కలిసి పదేళ్లుగా సైక్లింగ్ చేస్తున్నానని, ఆరోగ్యంతోపాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు ఇది దోహదపడుతుందని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment