సామర్థ్యాలు వెలికితీసేందుకే పరీక్షలు
సిరిసిల్లటౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలు వెలికితీసేందుకు ప్రతిభాపాటవ పరీక్షలు ఉపయోగపడతాయని నెహ్రూనగర్ హైస్కూల్ హెచ్‌ఎం నాగుల భాగ్యరేఖ పేర్కొన్నారు. తెలంగాణ సోషల్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్ల నుంచి 75 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. తొమ్మిది మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా సోషల్‌ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి రవి, కె.రాజ్‌కుమార్, ఫోరం జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇల్లంతకుంట(మానకొండూర్): రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్ విద్యార్థి దివ్య సాంఘికశాస్త్ర టాలెంట్‌టెస్ట్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు.
నాలుగో రోజుకు సమ్మె
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక ఇందిరమ్మకాలనీలో సివిల్ సప్లయ్ హమాలీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. హమాలీ కార్మికులకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. పెరిగిన వేతనాలు లెక్కగట్టి ఇవ్వాలని కోరారు. సమ్మెలో పుప్పాల రాజేశ్, బి.మల్లయ్య, కోమటి శివలింగం, నక్క రాములు, బొల్లి దేవయ్య, రాగుల రాజయ్య, దుమాల రాజిరెడ్డి, నూనె వెంకటేశం, రాగుల భద్రయ్య, జక్కయ్య, వెంకటేశ్, లింగయ్య, హమాలి కార్మికులు పాల్గొన్నారు.
ఆలయాల్లో టెండర్లు ఖరారు
వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ, దత్తత దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు శనివారం ఓపెన్‌స్లాబ్‌లో బహిరంగవేలం నిర్వహించారు. నాంపల్లి నర్సింహస్వామి ఆలయంలో నూనె, గురిగీలు, పాలు విక్రయించుకునేహక్కు, క్యాంటీన్ నిర్వహణకు ఈ–టెండర్ వేలం వాయిదా పడినట్లు ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్ తెలిపారు. మామిడిపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజసామగ్రి, పట్టెనామాలు, కోరమీసాలు అమ్ముకునే హక్కును ఎం.రాకేశ్ రూ.90వేలకు, కొబ్బరిముక్కలు పోగుచేసుకునే హక్కును రూ.50 వేలకు కె.విక్రమ్ దక్కించుకున్నట్లు తెలిపారు.
బీజేపీ జిల్లా పగ్గాలు ఎవరికో?
వేములవాడరూరల్: బీజేపీలో పార్టీ పదవుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవీని ఈసారి కూడా వేములవాడ ప్రాంతవాసులకే దక్కేలా ఉందనే చర్చ సాగుతోంది. సంక్రాంతి పండుగలోపు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈమేరకు ఇప్పటికే మండల, పట్టణ స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రతాప రామకృష్ణ సూచించిన వ్యక్తులకే మండల, జిల్లాస్థాయి పదవులు దక్కుతాయని ప్రచారం ఉంది. ఇప్పటికే ప్రతాప రామకృష్ణ రెండు పర్యాయాలు రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ ఒక పర్యాయం పనిచేశారు. ఈసారి కొత్త వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించనున్నట్లు తెలిసింది. మొదటి నుంచి వేములవాడ వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవీ దక్కగా.. ఈసారి కూడా ఈ ప్రాంతవాసికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రాఫిక్‌రూల్స్ పాటించాలి
సిరిసిల్లటౌన్: అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సిరిసిల్ల ఏఎంవీఐ రజనీ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాతబస్టాండు ప్రాంతంలో పాదచారులకు, ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రవాణా శాఖ సిబ్బంది రమ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment