అర గ్యారంటే అమలు
సిరిసిల్లటౌన్: ఏడాదిలో ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలైందని బీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు విమర్శించా రు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినం అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క గ్రామంలో ఒక్కరికన్న రూ.2లక్షల రుణమాఫీ చేశారా.. అని ప్రశ్నించా రు. సర్వశిక్షా అభియాన్ టీచర్లను రెగ్యులర్ చేస్తామన్న హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రమాణ హామీపత్రం ఇస్తేనే రైతుబంధు ఇస్తాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రేక్షక పాత్ర వహించొద్దు
స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రేక్షకపాత్ర పోషించకుండ, పోరాడాలని బీఆర్‌ఎస్ నేతలకు కేటీఆర్ హితబోధ చేశారు. గత ఎన్నికల్లో చిన్నపొరపాట్లతో ఓడిపోయామని, మళ్లీ ఆ తప్పులు చేయొద్దన్నారు. ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు వస్తే రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా ఒక్కొక్కరికి రూ.17,500, వృద్ధుల పింఛన్ డబ్బులు రూ.30 వేలు ఇవ్వాలని నిలదీయాలని కోరారు. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, వేములవాడ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పించండి
డబుల్ బెడ్‌రూమ్ లక్కీడ్రాల్లో పేర్లు రాని వారికి, డ్రాలో ఎంపికైన వారికి వెంటనే ఇళ్లు ఇప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. డ్రాలో ఎంపికై న వారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంతోనే అన్యాయం జరిగిందన్నారు.
ఆరు గ్యారంటీలు ఉత్తమాటే
అక్రమ కేసులపై న్యాయపోరాటం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment