చైనా మాంజా వినియోగించొద్దు | - | Sakshi
Sakshi News home page

చైనా మాంజా వినియోగించొద్దు

Published Mon, Jan 6 2025 7:20 AM | Last Updated on Mon, Jan 6 2025 7:20 AM

చైనా మాంజా వినియోగించొద్దు

చైనా మాంజా వినియోగించొద్దు

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్లక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలకు చైనా మాంజాకు అనుమతి లేదని, జిల్లాలో విక్రయించిన, వినియోగించిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నైలాన్‌, సింథటిక్‌ దారాలతో తయారుచేసే ఈ చైనా మాంజాలతో మనుషులతోపాటు పక్షులకు ప్రమాదకరమన్నారు. ఎవరైనా వినియోగిస్తుండగా చూస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement