నలిమెలకు పురస్కారం.. సాహితీవేత్తల హర్షం
● గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న భాస్కర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాషావేత్త, కవి, అనువాదకులు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అందజేశౠరు. భాస్కర్– సావిత్రి దంపతులను గవర్నర్‌తో సహా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, పీవీ నర్సింహరావు కుమారుడు, కేవీపీ రామచంద్రరావు తదితరులు ఘనంగా సత్కరించి అవార్డు అందజేశారు. మట్టిబిడ్డకు అవార్డు రావడంపై సాహితీప్రియులు, భాస్కర్ స్వస్థలం నారాయణపూర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భాస్కర్ కృషిని గుర్తించి వరుసగా అవార్డులు రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి జిల్లా నుంచి సాహితీవేత్తలు జూకంటి జగన్నాథం, రంగినేని మోహన్‌రావు, పెద్దింటి అశోక్‌కుమార్, మద్దికుంట లక్ష్మణ్, అశోక్, దుంపెన కిషన్, నలిమెల సత్యనారాయణ, వడ్నాల నర్సయ్య, పాత లింగన్న, దొంత ఆనందం, వేముల సత్యనారాయణ, దుంపెన రవి, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ శివారెడ్డి, భాస్కర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment