నేడు కలెక్టర్ అధ్యక్షతన జాతర సమావేశం
● హాజరు కానున్న విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం ఆలయం నుంచి రూ. కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పారటు చేశారు. సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతోపాటు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ హాజరు కానున్నారు. కాగా, కేవలం కాంట్రాక్టర్లు, అధికారులకు మేలు జరిగే పనులు చేస్తున్నారని, శాశ్వత ప్రాతిపదికన భక్తులకు సౌకర్యాలు అందించే దిశలో అధికారులు అడుగులు వేయడం లేదంటూ పురప్రముఖులు ప్రతీ సమావేశంలో పేర్కొంటున్నారు.
వసతిగదుల తిప్పలు
రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించే అంశంలోనూ అధికారులకు ముందుచూపు లేకుండా పోతుంది. గతంలో ఉన్న గదులు మినహా ఇప్పటి వరకు ఒక్క గది కూడా అందుబా టులోకి రాలేకపోయింది. కోడె మొక్కులు చెల్లించుకుందామనుకునే భక్తులను క్యూలైన్లలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అలాగే ఆలయంలో భద్రతా చర్యలకు అధికారులు మంగళం పలికారు.
నేడు సమన్వయ కమిటీ సమావేశం
మహాశివరాత్రి జాతర ఉత్సవాల నేపథ్యంలో వివి ధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధ్యక్షతన జాతర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఎజెండా రూపొందించారు. భక్తులకు మెరుగైన వసతి, సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment