రోడ్లపై ఆక్రమణలు తొలగించండి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలోని రోడ్లపై అక్రమణలు తొలగించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం ఎస్పీ అఖిల్ మహజన్‌తో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ విద్యాసంస్థలో రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, జిల్లాలో వారానికి ఒక్కరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, జిల్లాలో 13 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనతరం రోడ్డు భద్రత మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట రమణయ్య, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, లావణ్య, అన్వేశ్, డీఎంహెచ్‌వో రజిత, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి పంచాక్షరి, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పల్లెలను శుభ్రంగా ఉంచాలి
పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా పనులు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై ఎంపీడీవోలు, ఎంపీఓలు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కల్టెరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పారిశుధ్యం, నీటిసరఫరా, చెత్త సేకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వందశాతం ఇంటి, ఇతర పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, డీఎల్పీవో నరేష్, ఎస్‌బీఎం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment