ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
● విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: ప్రజా ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండల పరిధి గ్రామాల్లోని లబ్ధిదారులకు మంగళవారం అనుపురం గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. 33 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారాక్, 21 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాజన్న ఆలయ విస్తరణ, రోడ్ల వెడల్పు తదితర పనులు చూసి ఓర్వలేక ఇంటి పత్రికలో రోత పుట్టించే రాతలు రాస్తున్నారని, పిచ్చిపిచ్చి కథనాలు రాస్తూ కేటీఆర్ మెప్పు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, ఎర్రం రాజు, సత్తయ్య, చింతపల్లి శ్రీనివాస్‌రావు, ఆగయ్య, స్వామి, కదిరె రాజు, పండుగ ప్రదీప్, ఇటుకల రాజు, మల్లేశం, లింగయ్య, పర్శరాములు, దేవరాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment