● కబ్జా స్థలంలోనే బీఆర్‌ఎస్ భవనం ● నిజాలు రాస్తే విలేక
కేటీఆర్ అక్రమాలకు
అంతే లేదు
సిరిసిల్లటౌన్: పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ జిల్లాలో తన అనుచరులతో చేసిన అక్రమాలకు అంతే లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సిరిసిల్లలోని డీసీసీ ఆఫీస్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సిరిసిల్ల ప్రాంతంలోనే పేదలు, ప్రభుత్వానికి చెందిన వేయి ఎకరాలకుపైగా భూములను ఆక్రమించుకున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవనం కూడా కబ్జా చేసిన స్థలమేనని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కబ్జా చేసినోళ్లను కేటీఆర్ వెనుకేసుకొస్తున్నారని వి మర్శించారు. ఇప్పటికే కబ్జా చేసిన 200 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. కొందరు తమ తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి భూములు అప్పగిస్తుంటే కేటీఆర్ మాత్రం అక్రమార్కులను వెనుకేసుకొస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ భూభాగో తాలు వెలికితీస్తూ కథనాలు రాసిన పాత్రికేయులపై దురహంకారంతో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్ అక్రమాలు మరిన్ని బట్టబయలవుతాయని ప్రకటించారు. తమ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని, సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని స్పష్టం చేశారు. దేశపౌరుడు కాని వ్యక్తిని వేములవాడ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టిన అక్రమ సంస్కృతి బీఆర్‌ఎస్‌కే చెల్లిందన్నారు. సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూప, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, గోలి వెంకటరమణ, కత్తెర దేవదాసు ఉన్నారు.
● డీఈవో జగన్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment