పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు, అనుబంధ యూనియన్లు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి కోరారు. పీఆర్టీయూ జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. రానున్న పదోతరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, గౌరవాధ్యక్షుడు కామినేని నీలి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు మాడిశెట్టి మహేశ్, జక్కని నవీన్‌యాదగిరి, మానువాడ శంకర్, గుర్రం మల్లారెడ్డి, దుబ్బాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment