రూ.71కోట్లతో అభివృద్ధి పనులు
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.71కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంతోపాటు రాచర్లగొల్లపల్లి గ్రామంలోనూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.26కోట్ల ఎన్‌ఆర్‌జీఎస్ పనులు చేపట్టామని, ఎస్‌డీఎఫ్ ద్వారా రూ.10కోట్లు, ఎంఎంఆర్ కింద రూ.15కోట్లు, త్వరలో ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.20కోట్లతో పలు పనులు చేపడతామని తెలిపారు. ఈ పనులకు ఆర్థిక సంవత్సంలోనే బిల్లులు వస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పాల్పడిన అవినీతి, అక్రమాల వెలికితీతకు అందరూ సహకరించాలని కోరారు. ఈనెల 26 నుంచి రైతుభరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, రాచర్లతిమ్మాపూర్ సింగిల్‌విండో వైస్‌చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, నాయకులు చేపూరి రాజేశం, బండారి బాల్‌రెడ్డి, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, సాహెబ్, లింగంగౌడ్, గిరిధర్‌రెడ్డి, గుర్రపు రాములు పాల్గొన్నారు.
భగీరథ కార్మికుల సమస్యలు తీర్చాలి
సిరిసిల్లటౌన్: మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులకు సబ్ కాంట్రాక్టర్ ద్వారా వేతనాలు ఇస్తుండడంతో తక్కువగా వస్తాయన్నారు. 9 నెలలుగా వేతనాలు రాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ బాధితునికి రూ.10వేల ఆర్థిక సాయం
● ముందుకొచ్చిన మై వేములవాడ ట్రస్టు
వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన కిడ్నీ బాధితుడు సమీర్‌కు మై వేములవాడ ట్రస్ట్ అండగా నిలిచింది. ‘మా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టండి’ శీర్షిక ప్రచురితమైన కథనానికి మై వేములవాడ ట్రస్ట్ సభ్యులు స్పందించారు. స్థానిక మార్కెట్‌యార్డులోని సమీర్ ఇంటికి చేరుకుని రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. నజూమ–నజీర్ దంపతుల కుమారుడు సమీర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.12లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలపడంతో ఆ పేద దంపతులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రస్టు సభ్యుల సహకారంతో ఆర్థిక సాయం చేసినట్లు ట్రస్టు నిర్వాహకుడు మధు మహేశ్ తెలిపారు.
యూరియా వచ్చేసింది
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలో యూరి యా కొరత తీవ్రంగా ఉందని.. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం మూడు లారీల యూరి యాను తహసీల్దార్ మారుతిరెడ్డి పంపించా రు. రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment