రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
● పాఠ్యాంశంగా పరిశీలిస్తున్నాం ● వీసీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్ నుంచి శనివారం రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు. రోడ్డుప్రమాదాల్లోనే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నియమాలు పాటించని వారి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, రోడ్లు భవనాలశాఖ, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment