బీఆర్‌ఎస్ పీఠాలు కదులుతున్నాయ్
● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: పదేళ్లపాటుగా అక్రమాలకు పాల్ప డుతూ.. పాలన సాగించిన బీఆర్‌ఎస్ పీఠాలు కదులుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కేటీఆర్ చేసిన అక్రమాల విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. ఓడిపోయిన కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నానని కేటీఆర్ మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి తోకచుక్కలెక్క వచ్చి పోతుండని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం, చట్టం తన పని చేసుకొనిపోతే పిచ్చిలేచిన వాడిలా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్‌ను విమర్శించారు. గ్లోబల్ ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నావా.. అని ప్రశ్నించారు. మహిళ చనిపోతే మాట్లాడని కేటీఆర్ సినిమా హీరోల కోసం మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక, భూ, ట్రాకర్ల్లు, గొర్రెల స్కాం బయటకు రాబోతుందన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment