విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
● గురుకులాలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలి ● 15 రోజుల్లో పిల్లలకు వైద్యపరీక్షలు చేయించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్య మైన పౌష్టికాహారం అందించాలని కలెక్లర్ సందీ ప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెసిడెన్షియ ల్ పాఠశాలలు, సంక్షేమహాస్టల్స్, ఏకలవ్య మోడల్‌స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూ చించారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలలో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్‌లో చదివే విద్యార్థులకు 15 రోజుల్లో హెల్త్ చెక్‌అప్ చేయించాలని ఆదేశించారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా మంచాలు, దుప్పట్లు ఉండేలా చూడాలని, పిల్లలకు డైనింగ్ ఏర్పాట్లు, హాస్టల్స్ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. కామన్ డైట్ ప్రకారం సరుకులు సరఫరా చేయని కాంట్రాక్టర్‌లను మార్చాలని సూచించారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఈవో జగన్మోహన్‌రెడ్డి, ఎస్‌డీసీ రాధాబాయి, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌సీవోలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment