ఆపరేషన్ స్మైల్ సక్సెస్ చేయండి
● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లకల్చరల్: మైనర్ బాలలతో పనులు చేయించే వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్‌మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ మాట్లాడు తూ ఈనెల 31 వరకు ఆపరేషన్‌స్మైల్–11లో భాగంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించడం ద్వారా బాలకార్మికులను గుర్తించే ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించే దిశగా జరుగుతున్న ఆపరేషన్ స్మైల్‌ను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ‘దర్పణ్’ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు వద్దకు చేర్చాలని సూచించారు. భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాలకార్మికుల గురించి సమాచారాన్ని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 112కు డయల్ చేసి చెప్పాలని కోరారు. ఇటుకబట్టీలు, బస్‌స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మ న్ అంజయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రజిత, రమేశ్, షీటీమ్ ఏఎస్సై ప్రమీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment