నేతన్నలకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు
● చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్
సిరిసిల్ల: నేతన్నలకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు మిట్టకోల సాగర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌లో శుక్రవారం మనోవికాస కేంద్రం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పంపిణీ చేసే చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఇస్తుందన్నారు. వస్త్రపరిశ్రమను అభివృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూలుడిపోను ఇచ్చిందని, పవర్ సబ్సిడీ కొనసాగిస్తోందని తెలిపారు. త్రిఫ్ట్, నేతన్న బీమా, యార్న్ సబ్సిడీ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఎలాంటి మానసిక సమస్య ఎదురైనా ధైర్యం కోల్పోకుండా మైండ్‌కేర్ సెంటర్‌లోని సైకాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. సైకాలజిస్ట్ కె.పున్నంచందర్, వస్త్రపరిశ్రమ యజమానులు బండారి అశోక్, మంచె మల్లయ్య, బండారి వేణుగోపాల్, మైండ్‌కేర్ సెంటర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, రాపెల్లి లత, కొండ ఉమా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment