లింగ నిర్ధారణ చేస్తే సీజ్ చేస్తాం
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: గర్భస్థ లింగనిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఆఫీస్‌లో శుక్రవారం జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సర్టిఫికెట్లలో రేడియాలజిస్ట్ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేయడంతోపాటు రూ.10వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. వైద్యులు అంజలినా ఆల్ఫ్రెడ్, లక్ష్మీనారాయణ, శోభారాణి, డీపీఆర్వో శ్రీధర్, లీగల్ అడ్వయిజర్ శాంతిప్రకాశ్‌శుక్లా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చింతోజు భాస్కర్, ఝాన్సీలక్ష్మి, రామానుజమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment