కమలం జోరు.. హస్తం హోరు
● లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల సత్తా ● డీలాపడ్డ బీఆర్‌ఎస్ ● ప్రచారం చేసిన పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ● ముగిసిన సర్పంచ్, జెడ్పీ, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ● కాంగ్రెస్ కండువా కప్పుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ● రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల మర్డర్
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కమలం జోరు.. హస్తం హవా కొనసాగింది. బీఆర్‌ఎస్ డీలా పడింది. రెండోసారి ఎంపీగా గెలిచి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించగా, కాకా వారసుడిగా తొలిసారి పోటీ చేసిన ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి గెలుపొందారు. వరుసగా రెండోసారి ఎంపీగా ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి విజయం సాధించగా, ఈటల రాజేందర్ తొలిసారి ఎంపీగా మల్కాజిగిరి నుంచి గెలిచారు. నాలుగు చోట్ల బీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య, ముఖ్య నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయంగా పెను సంచలనంగా మారాయి. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్‌ల మధ్య మాటల యుద్ధం, అసెంబ్లీలో మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల మధ్య కొనసాగిన కరీంనగర్ పంచాయితీ, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్‌కు కారణమయ్యాయి. సిరిసిల్ల కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ సిగ్నల్స్ ఉమ్మడి జిల్లాను తాకడం రాజకీయ నేతల్లో కలకలం రేపింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. –సాక్షి ప్రతినిధి, కరీంనగర్●
మార్చి 12: కరీంనగర్ కదనభేరి పేరిట లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన మాజీ సీఎం కేసీఆర్.
ఏప్రిల్ 05: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్.
మే 03: పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం రామగుండంలో నిర్వహించిన రోడ్డు షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
మే 05: వీణవంక ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జగిత్యాల రోడ్డు షోలో పాల్గొని, కొండగట్టులో ఓ హోటల్ వద్ద యువతులతో సెల్ఫీ దిగారు.
మే 09: బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు కోసం కరీంనగర్ రోడ్ షోలో పాల్గొన్నారు. – మిగతా 8లోu
మార్చి 18: బీజేపీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం జగిత్యాల జిల్లాలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
మే 08: వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ. అనంతరం స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఏప్రిల్ 30: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలుపు కోసం హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.
మే 01: టి.జీవన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలంటూ కోరుట్లలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పాల్గొన్నారు.
మే 04: రాజారాంపల్లి, సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మే 07: కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
నవంబర్ 20: వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం. రూ.1,000 కోట్లకుపైగా అభివృద్ధి పనులు మంజూరు చేసి, వరాల జల్లు కురిపించారు.
డిసెంబర్ 04: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా యువ వికాసం పేరిట పెద్దపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికై న 9 వేల మందికి నియామాక పత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment