సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అమలు చేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షను 19వ రోజు శనివారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పీటీఐ వస్తువులు తయారు చేసిన నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి, శీలం రాజు, రవీందర్, రాగుల రాజిరెడ్డి, అన్నల్‌దాస్ వేణు, గూడూరు భాస్కర్, దుమాల శ్రీకాంత్, ఆసాని రామలింగారెడ్డి, విష్ణు, చందు, రఘునాథరావు, ఎస్జీటీ యూనియన్ బాధ్యులు మధుసూదన్‌రావు, రమణారెడ్డి, బీసీ జనసభ ఓయూ ఫౌండర్ రాజారాంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు’
సిరిసిల్లటౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ భవనంలో శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేస్తామన్న హామీని ఏడాదిగా అమలు చేయడం లేదన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ముద్దం అనిల్, సాయి, వినయ్, కోడం వెంకటేశం, సమీ, అక్రమ్, సాయి, గణేశ్, విష్ణు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్ల గురుకుల విద్యార్థిని గజ్జి శరణ్య సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటింది. వరంగల్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఖోఖో క్రీడలో పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ రాధ తెలిపారు. పీఈటీ స్వాతి, విద్యార్థిని శరణ్యను ప్రిన్సిపాల్ అభినందించారు.
‘వర్గీకరణ చేపట్టకపోతే పోరుబాట’
చందుర్తి(వేములవాడ): సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ఫిబ్రవరి 3న రాష్ట్ర వ్యాప్త పోరాటానికి మాదిగల సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు థామస్ కోరారు. చందుర్తిలో ఎమ్మార్పీఎస్ ఆఫీస్‌ను శనివారం ప్రారంభించారు. థామస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఈ పోరాటానికి ప్రతీ ఒక్కరు డప్పుతో హైదరాబాద్ తరలిరావాలని కోరారు. శంకరయ్య, ఆవునూరి ప్రభాకర్, ఎలగందుల భిక్షపతి, కానాపురం లక్ష్మణ్, దుమ్ము అంజయ్య, లింగంపల్లి బాబు, కుమ్మరి లచ్చయ్య, లింగంపల్లి వెంకటి, అర్జున్ పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచి, లక్ష్యాలను సాధించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. డాక్టర్ రజిత మాట్లాడుతూ రోగులతో మర్యాదగా మెదలాలని సూచించారు. వ్యాక్సినేషన్ సక్రమంగా చేయాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రి వైద్యురాలు కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment