కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి
వేములవాడ: ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్‌బాటపట్టిన తండ్రి కొద్ది రోజులకే ఇంటిబాట పట్టగా, ఎదిగొచ్చిన కొడుకు రెండు కిడ్నీలు పాడయి మంచానికి పరిమితమవడంతో ఆ కుటుంబం కష్టాల కడలిలో కొట్టమిట్టాడుతోంది. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు కుప్పలుగా మారుతుండగా, కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండడం మరింత వేదనకు గురిచేస్తుంది. వేములవాడలోని మార్కెట్‌యార్డు రోడ్‌లో నివసించే నజీర్ చికెన్ సెంటర్‌లో పనిచేస్తుండగా, భార్య నజుమా బీడీ కార్మికురాలు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు నయీమ్, సమీర్. చిన్న కుమారుడు డిగ్రీ చదువుతున్న మహమ్మద్ సమీర్(19) కిడ్నీ వ్యాధితో మంచంపట్టాడు. రెండు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. చికిత్స కోసం రూ.12లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
19 ఏళ్లకే కిడ్నీవ్యాధితో మంచంపట్టిన యువకుడు
సర్జరీకి రూ.12లక్షలు అవసరం
ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు
ఫోన్ పే : 7893132088
మహమ్మద్ నయీమ్‌పాషా
బ్యాంక్ ఖాతా : 62432397855
ఐఎఫ్‌సీ : 72228431693
Comments
Please login to add a commentAdd a comment