ఉద్యోగులు ఆన్‌లైన్‌లో సెలవు పెట్టాలి
● జనవరి 1 నుంచి అమలు ● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల: జిల్లాలో పనిచేసే ఉద్యోగులు జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో సెలవు దరఖాస్తు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ–హెచ్‌ఆర్‌ఎం పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తు చేయాలని సూచించారు. దీనిపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఈ–ఆఫీస్ లాగిన్ ఐడీ వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగుల జాబితా, సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. ఎస్‌డీసీ రాధాబాయి, సీపీవో శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, డీఎస్‌వో వసంతలక్ష్మి, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, పౌరసరఫరాల డీఎం రజిత, జౌళిశాఖ ఏడీ సాగర్, మిషన్ భగీరథ ఈఈ జానకి, ఎస్‌సీడీవో విజయలక్ష్మి, డీవైఎస్‌వో రాందాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, మైనింగ్ ఏడీ క్రాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment