దురలవాట్లు మాని, సామాజిక సేవ
శంకరపట్నం: మొలంగూర్‌కు చెందిన మోరె గణేశ్ 2023 డిసెంబర్ 31న దురాలవాట్లు మాని, సామాజిక సేవ చేస్తానని శపథం చేశాడు. అనుకున్నట్లే మొలంగూర్‌కే చెందిన అనాఽథ బాలుడు చిట్యాల గణేశ్‌ను చదివిస్తున్నాడు. కంటిచూపు సమస్యతో బాధ పడుతున్న ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసేందుకు ఆర్థికసాయం చేశాడు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశాడు. ఊళ్లో పేదలకు ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రిలే నిరాహార దీక్ష చేశాడు.సెంట్రింగ్ పని, చిరువ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment