– మిగతా 8లోu
జూన్: జగిత్యాల కలెక్టర్ యాస్మిన్‌బాషా బదిలీ కాగా.. ఆమె స్థానంలో సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. సందీప్‌కుమార్ ఝా విధుల్లో చేరారు. పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానంలో కోయ శ్రీహర్ష బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ స్థానంలో అశోక్‌కుమార్ చార్జ్ తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయినా.. సాంకేతిక కారణాలతో తిరిగి ఆమెనే కొనసాగించారు. ఇదేమాసంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెటనపల్లి గ్రామంలో కాంగ్రెస్ లీడర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు నరేశ్ హత్య కలకలం రేపింది.
మార్చి: జగిత్యాలకు చెందిన పీఎప్‌ఐ నాయకుడు సలీంను జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో అరెస్ట్ చేశారు.
మే: కోల్ కారిడార్‌గా పిలిచే రామగుండం(రాఘవాపూర్)–మణుగూరు రైల్వేలైన్ కోసం ప్రభుత్వం భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హత్యలు.. అవకతవకలు టీజీఎస్పీ పోలీసుల ఆందోళన నకిలీ పాస్‌పోర్టులు, సీఎంఆర్‌ఎఫ్ బిల్లులు 2024లో ఎన్నో సంచలన ఘటనలకు వేదికై న ఉమ్మడి జిల్లా ‘సాక్షి’లో కథనాలు.. విజిలెన్స్, సీఐడీ దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2024 ఏడాదిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎన్నో సంచలనాలకు వేదికై ంది. భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, శాతవాహన యూనివర్సిటీ అవకతవకలు, టీజీఎస్పీ పోలీసులు రోడ్డెక్కడం, నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం, సీఎంఆర్‌ఎఫ్ నకిలీ బిల్లుల వ్యవహారంలో రెండు ఆస్పత్రులపై సీఐడీ కేసులు, కలెక్టర్ల బదిలీ, తప్పుడు చిరునామాతో గన్ లైసెన్స్ తీసుకోవడం వంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనా లు ప్రచురించగా.. అధికారులు స్పందించారు. విజిలెన్స్, సీఐడీ విచారణ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలపై ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment