31న విస్తృత తనిఖీలు
● డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు ● డీజే అధిక శబ్దాలకు నో చాన్స్ ● పోలీసులకు ప్రజలు సహకరించాలి ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: ఇయర్ ఎండింగ్ వేడుకలు.. డిసెంబర్ 31న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ శాంతిభద్రతలకు విఘాదం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ అఖిల్‌మహాజన్ హెచ్చరించారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడా రు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అధిక శబ్దాల డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. నూతన సంవత్సరం వేడుకలు 2025 సమీపిస్తున్న వేళ జిల్లాలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండ భద్రత ఏర్పాట్లు చేస్తున్నటు తెలిపారు. టపాసులు కాల్చవద్దన్నారు. మద్యంమత్తులో వాహనాలు నడపడం నేరమని, ఇళ్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధిదీపాలపై రాళ్లు వేయడం, అద్దాలను పగులగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్‌లను తీసివేసి వాహనాలు నడపొద్దన్నారు. నిర్ణీత సమయంలో మద్యం దుకాణాలను క్లోజ్ చేయాలని, మైనర్లకు మద్యం విక్రయించొద్దని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment