సబ్‌కోర్టు ఏజీపీగా ప్రశాంత్
వేములవాడ: పట్టణంలోని సబ్‌కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీ)గా బొడ్డు ప్రశాంత్‌కుమార్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో సన్మానించారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన ప్రశాంత్‌కుమార్ ఏజీపీగా నియమితులు కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
ఇసుక ట్రాక్టర్ల తనిఖీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక ట్రాక్టర్ల అతివేగంపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వేగంగా ఇసుక వాహనాలు నడపొద్దని డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈనెల 21 ‘సాక్షి’లో ‘అతివేగం.. అజాగ్రత్త’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై పోలీసు అధికారులు స్పందించారు. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో మండలంలోని రాగట్లపల్లి, ఎల్లారెడ్డిపేట శివారుల్లో ఇసుక ట్రాక్టర్ల తనిఖీలు చేపట్టారు. మైనర్ డ్రైవింగ్‌పై ఆరా తీశారు.
మాతా, శిశు సంరక్షణ లక్ష్యాలు సాధించాలి
సిరిసిల్ల: జిల్లాలో మాతా, శిశు సంరక్షణ లక్ష్యాలు సాధించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలందిస్తూ మందులు పంపిణీ చేయాలని తెలిపారు. పేదలు, ఆర్థిక స్థోమత లేని వారే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. తంగళ్లపల్లి డాక్టర్ స్నేహ, సిబ్బంది పాల్గొన్నారు.
యారన్ డిపో లక్ష్యం నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరుచేసిన యారన్ డిపో లక్ష్యాన్ని నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంతం రవి కోరారు. జిల్లా కేంద్రంలోని కార్మిక భవనంలో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. చాలా మంది ఆసాములు, మ్యాక్స్ సంఘాల సభ్యులు 10 రోజుల క్రితమే యారన్ కోసం డీడీలు ఇచ్చినా సరఫరా కావడం లేదన్నారు. 20 రోజుల క్రితం డీడీలు తీసిన దాదాపు 130 మంది యారన్ లేక లూమ్స్ నడపలేదన్నారు. బండారి అశోక్, బూట్ల సతీశ్, మంచి మల్లయ్య, దూస అశోక్, కొక్కుల మధు, అల్లె వేణు పాల్గొన్నారు.
ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్‌లో ఉద్యోగాలు
సిరిసిల్లకల్చరల్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు క్లరికల్, టెక్నికల్ కేడర్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని జిల్లా యువజన సర్వీసుల అధి కారి అజ్మీర రాందాస్ ప్రకటనలో తెలిపారు. సంబంధిత నోటిఫికేషన్ జారీ అయిందని, http://agnipathvayu.cdac.inలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జనవరి 7 నుంచి 25 వరకు కొనసాగుతాయన్నారు. ఆసక్తి గల యువత దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చైనా మాంజా నిషేధంపై నేడు పోస్టర్ ఆవిష్కరణ
సిరిసిల్లకల్చరల్: సంక్రాంతి సందర్భంగా చైనా మాంజాను నిషేధిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి సాధించాలి
బోయినపల్లి(చొప్పదండి): ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో మాదిగలు అభివృద్ధి సాధించాలని మాదిగల ఐఖ్య సంక్షేమ సంఘం(ఎంఏఎస్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మిద్దెపాక రవీందర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలో సోమవారం మాట్లాడారు. జన్ను రాములు, ఇమ్మడి పవిత్రన్, మారపల్లి ఎల్లయ్య, ఉల్లెందుల అనిల్, అజయ్, శేఖర్, సాగర్, ప్రసాద్, జగన్, రాజు, మహేందర్, ఈశ్వర్, శ్రీనివాస్, లక్ష్మీరాజం, చరణ్ పాల్గొన్నారు.
ప్రశాంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment