ఎన్‌సీడీ వ్యాధుల నమోదు చేయాలి
సిరిసిల్ల/బోయినపల్లి: జిల్లాలో ఎన్‌సీడీ(బీపీ, షుగర్, క్యాన్సర్) వ్యాధుల నమోదు లక్ష్యం చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్ పీహెచ్‌సీలను బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. టీబీ, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో సూచించారు. కొదురుపాక వైద్యాధికారి రేణుప్రియాంక, విలాసాగర్ వైద్యాధికారి అనిత, డిప్యూటీ డెమో రాజకుమార్, సీహెచ్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో రామానుజమ్మకు పతకం
సిరిసిల్ల: జాతీయ స్థాయి ఫస్ట్ సౌత్ ఏషియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో సిరిసిల్లకు చెందిన టమటం రామానుజమ్మ(70) పతకం సాధించారు. కర్నాటకలోని మంగళూర్ మంగళ స్టేడియంలో జనవరి 10, 11, 12 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 70 ఏళ్లకు పైబడిన విభాగంలో రామానుజమ్మ పోటీపడ్డారు. 800 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానంలో నిలిచి పతకం సాధించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో పతకం సాధించిన ఏకైక మహిళగా రామానుజమ్మ గుర్తింపు పొందారు.
7న ‘వెయ్యి గొంతులు– లక్ష డప్పులు’
సిరిసిల్లటౌన్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే ‘వెయ్యిగొంతులు– లక్ష డప్పులు’ మహాప్రదర్శన నిర్వహించనున్నట్లు సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు బడుగు లింగయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరులో బుధవారం డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈనెల 24న సిరిసిల్లలో నిర్వహించే ఎమ్మార్పీఎస్ జిల్లాస్థాయి సన్నాహక సదస్సుకు మందకృష్ణమాదిగా హాజరవుతున్నారని, పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నాయకులు ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, లింగంపెల్లి సత్యనారాయణ, సావనపల్లి రాకేశ్, పసుల దుర్గయ్య, మంగళి చంద్రమౌళి, సంతోష్ పాల్గొన్నారు.
గోదారంగనాథుల కల్యాణం
బోయినపల్లి(వేములవాడ): మండలంలోని మాన్వాడ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదారంగనాథుల కల్యాణం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కల్యాణం జరిపించారు. స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పరాంకుశం రమేశ్‌తో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment