పథకాలు శ్రద్ధగా అమలు చేయాలి
● ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఆర్డీవో, ఇన్‌చార్జి డీపీవో, మండల నోడల్ అధికారి శేషాద్రి పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండల పరిషత్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అర్హులకు పథకాలు అందేలా చూడడంతోపాటు అనర్హులను ఏరివేయాలని సూచించారు. ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అహ్మద్ బేగ్, ఎంఈవో రాజునాయక్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు భద్రతపై ఆటోడ్రైవర్లకు అవగాహన ఉండాలని మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సూచించా రు. మండల కేంద్రంలో బుధవారం ఆటోడ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎంవీఐ వంశీధర్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడప డం నేరమన్నారు. సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజు, కానిస్టేబుల్ ప్రశాంత్, సంజన డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment