వస్త్రపరిశ్రమ అభివృద్ధికి చర్యలు
● 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ● టెస్కో జీఎం అశోక్‌రావు
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టెస్కో జీఎం అశోక్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు సోమవారం అందించారు. టెస్కో జీఎం అశోక్‌రావు మాట్లాడుతూ ఇందిరా మహిళాశక్తి చీరల పథకంలో భాగంగా ముందుగా ఒక చీరను( అందరికీ ఒకే రంగు చీర) ఆర్డర్స్ సుమారు 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చీరలను ఏప్రిల్ 30లోగా సిద్ధం చేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ మార్కెట్‌తో పోటీపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించాలని సూచించారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారు. చేనేత జౌళిశాఖ ఏడీ ఎం.సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, ప్రతినిధులు తాటిపాముల భాస్కర్, మండల బాలరాజు, బూట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment