భద్రత నియమాలు పాటించాలి
సిరిసిల్లకల్చరల్: సురక్షిత ప్రయాణానికి నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి రాధికా జై స్వాల్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రవాణాశాఖ సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అధిక వేగం ప్రమాదానికి కారణమవుతుందన్నారు. నిబంధనలు పాటించని పలువురు వాహనదారులను ఆపి గులాబీ పుష్పాన్ని బహూకరించి సున్నితంగా హెచ్చరించారు. అనంతరం రవాణాశాఖ సిబ్బంది వాహనాలకు భద్రతను సూచనలతో కూడిన స్టిక్కర్లను అంటించారు. జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్, ఎంవీఐ జి.వంశీధర్, ఏఎంవీఐ రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, ఎల్లయ్య, కల్పన, శ్రావణి, ట్రాక్టర్ ట్రాలియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment