వేములవాడ: రాజన్న ఆలయంలో పలు సేవలకు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్ల ద్వారా ఆలయానికి మరింత ఆదాయం సమకూరింది. కొబ్బరికాయల విక్రయ లైసెన్స్‌హక్కు గతంలో రూ.1,71,55,555 ఉండగా ఈసారి రూ.2,20,55,555.55 హెచ్చు పాటదారుడు శివరాత్రి చందుకు లభించింది. వెజిటేరియన్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు గతంలో రూ.41.20లక్షలు ఉండగా ఈసారి రూ.46.50 లక్షలకు కె.రమేశ్ దక్కించుకున్నారు. ఒడిబియ్యం, ఎండుకొబ్బరి, బెల్లం గతంలో రూ.1,22,55,555 ఉండగా ఈసారి రూ.1,95,55,999 విక్రమ్‌కు లభించింది. కరీంనగర్ షాప్ నంబర్ 26 గతంలో రూ.3,48లక్షలు ఉండగా ఈసారి రూ.3.60లక్షలకు కె.నవ్య దక్కించుకున్నారు. కాగా భీమేశ్వరసదన్‌లో క్యాంటీన్ నిర్వహణకు సరైన పాట రానందున టెండర్ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment