● నేరెళ్ల ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ ● మధ్యాహ్న భోజన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిత్యం జిల్లా అభివృద్ధి పనుల్లో తలమునకలయ్యే కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శుక్రవారం ఉపాధ్యాయుడిగా మారారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయోలజీ పాఠాలు బోధించారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అంతకుముందు పాఠశాల ఆవరణ, తరగతిగదులు, వంటగదిని పరిశీలించారు. కూరగాయలు, పప్పు, కోడిగుడ్లు సిద్ధం చేస్తుండగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment