రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్రం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రాన్ని విస్మరించింది. ఎన్నికలు ఉన్న రాష్ట్రానికి పెద్దపీట వేసింది. గతంలో మాదిరిగానే నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయిచ్చారు. అన్ని వర్గాలను నిరాశపర్చిన బడ్జెట్. గత పదేళ్లతోపాటు ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా దేశ పురోగతిని అడ్డుకునేలా ఉంది.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
రాష్ట్రానికి మొండిచేయి
రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజే పీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు సాధించలేదు. పక్క రాష్ట్రానికి కేటాయించిన నిధులను చూసి బీజేపీ ఎంపీలు సిగ్గుతెచ్చుకోవా లి. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని బడ్జెట్. కేంద్ర సర్కారు మరోసారి తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపింది.
– తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
ప్రజల ఆకాంక్షకు అద్దం
ఆర్థికమంత్రి ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ, విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతతో 2027 వరకు భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకునేలా ఉంది. ఎంబీబీఎస్, ఐఐటీ సీట్ల పెంపు హర్షనీయం.
– అల్లాడి రమేశ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment