ముదిరాజ్‌లు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● మిడ్‌మానేరులో ఉపాధి అవకాశాలు ● జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకారం
సిరిసిల్లటౌన్: ముదిరాజ్‌లు ఇతర కులస్తులను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్‌లో శనివారం జరిగిన జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా నాయకులు పనిచేయాలన్నారు. కులమే ఒక బలగంలా పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రశ్నించే వారికి గుర్తింపు ఉంటుందని, తెలంగాణ, జిల్లా సాధన ఉద్యమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము పోరాటాన్ని కొనియాడారు. ముదిరాజ్‌ల చిరకాల కోరిక బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మిడ్‌మానేరు డ్యామ్‌లో చేపల పెంపకానికి కేజీకల్చర్ ద్వారా సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులపై ఇతర ప్రాంతాల్లో అధ్యయనం చేసి రావాలని సూచించారు. మహాత్మాజ్యోతిబాపూలే వంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ బీసీలందరం ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ జిల్లా సంఘ భవనానికి సహకరిస్తానన్నారు.
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి ముదిరాజ్ కులస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా చొక్కాల రాము, ప్రధాన కార్యదర్శి సరుగు నరేశ్, ఉపాధ్యక్షులుగా గొడుగు నర్సయ్య, శివండ దేవరాజు, రేగుల రాజ్‌కుమార్, కోశాధికారిగా కనకాల శేఖర్‌బాబు, సెక్రటరీలు పెరిమెల్ల రమేశ్, తునికి నరేశ్, రేగుల పర్శరాములు, సంయుక్త కార్యదర్శిగా జనగపల్లి శంకర్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం, ముఖ్య నాయకులు కరుణాల భద్రాచలం, పర్శ హన్మాండ్లు, రెడ్డబోయిన గోపి, బొజ్జ కనకయ్య, రేగుల మల్లికార్జున్, వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment