మాతా, శిశు మరణాలు అరికట్టాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: జిల్లాలో మాతా, శిశుమరణాలను అరికట్టాలని, ఒక్క మరణం కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్‌లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శనివారం మాతా, శిశుమరణాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారలోపం లేకుండా చూడాలని, ప్రసూతి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. వేములవాడ ప్రాంతీయ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ పి.పెంచలయ్య, ఐఎంఏ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా శిరీష పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి ప్రోగ్రాం ఆఫీసర్‌లతో జిల్లాలోని మలేరియా ఎల్టీలతో, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లతో సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment