బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
● ముగిసిన ఆపరేషన్ స్మైల్ ● 31 మంది బాలకార్మికుల పట్టివేత ● యజమానులపై 8 కేసులు ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: బడీడు పిల్లలను పనిలో కాదు బడిలో ఉండాలనే దానిని పక్కాగా అమలు చేయడానికి ఏటా నిర్వహించే ఆపరేషన్ స్మైల్ ముగిసిందని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జిల్లాలో 31 మంది పనిలో ఉన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు అప్పగించడంతోపాటు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పనిచేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీధి బాలలను చూస్తే.. డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment