జాతీయస్థాయిలో రాష్ట్ర పోలీసులు భేష్
కరీంనగర్‌స్పోర్ట్స్: జాతీయస్థాయిలో జరిపిన సర్వేలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని, ఆలిండియా పోలీస్ డ్యూటీమీట్ పోటీల్లో తెలంగా ణ పోలీసులు మొదటిస్థానంలో నిలిచారని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ జితేందర్ ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవలే ఆధునికరించిన పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జాతీయస్థాయిలో జరిగే క్రీడల్లో తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఏటా రాష్ట్ర పోలీసులకు క్రీడాపోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలు అద్భుతంగా నిర్వహించినందుకు స్పోర్ట్స్ ఐజీ రమేశ్‌రెడ్డి, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని అభినందించారు. స్పోర్ట్స్ ఐజీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో 2,380 మంది క్రీడాకారులు పాల్గొనగా, 296 మంది మహిళలు, 12 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారన్నారు. 28 క్రీడాంశాల్లో 236 బంగారు పతకాలు, 236 వెండి పతకాలు, 396 కాంస్య పతకాలను క్రీడాకారులు గెలుచుకున్నట్లు తెలిపారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేషన్ డీఐజీ గజరావు భూపాల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, శిక్షణ ఐపీఎస్ వసుంధర, కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
చాంపియన్ హైదరాబాద్
3వ రాష్ట్ర పోలీసు క్రీడాపోటీల చాంపియన్‌గా హైదరాబాద్ కమిషనరేట్ నిలిచింది. టీజీఎస్పీ రేంజ్– 1 ద్వితీయస్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్ విభాగంలో రాచకొండ కమిషనరేట్, స్విమ్మింగ్‌లో ఆర్‌బీవీఆర్‌ఆర్ టీజీపీఏ, ఆర్చరీలో టీజీఎస్పీ రేంజ్–1, బాక్సింగ్‌లో హైదరాబాద్ కమిషనరేట్ విజేతలుగా నిలిచాయి.
ఏటా క్రీడాపోటీలు జరిగేలా చర్యలు
డీజీపీ డాక్టర్ జితేందర్
ముగిసిన 3వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలు
ఓవరాల్ చాంపియన్‌గా హైదరాబాద్ కమిషనరేట్
Comments
Please login to add a commentAdd a comment