ఆస్పత్రిలో సేవలెలా ఉన్నాయి
● గర్భిణులకు ఫోన్ చేసి అడిగిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
కోనరావుపేట(వేములవాడ): ‘హలో.. నేను జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు ఎలా ఉన్నాయి. సిబ్బంది అందిస్తున్న సేవలతో మీరు సంతృప్తి చెందుతున్నారా?’ అంటూ గర్భిణులకు జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఫోన్‌చేసి అడిగారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణ, ఇన్‌పేషంట్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న గర్భిణులతో ఫోన్‌లో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు.
విద్యార్థులు 10 జీపీఏ సాధించాలి
రానున్న పబ్లిక్ పరీక్షల్లో పదోతరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా తీర్చిదిద్దాలని టీచర్లకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కోనరావుపేటలోని కేజీబీవీని తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు గణితం, సైన్స్ పాఠ్యాంశాలు బోధించి, విద్యార్థినుల అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వేణుమాధవ్, కేజీబీవీ ఎస్వో ఇందిర, కళాశాల ప్రిన్సిపాల్ కేదారేశ్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment