గద్దర్ జీవితం పేదోళ్ల ఉన్నతికి అంకితం
సిరిసిల్లటౌన్: ప్రజాయుద్ధనౌక గద్దర్ జీవితం పేదల ఉన్నతి కోసం అంకితం చేశారని పలువురు కొనియాడారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలోని రుచి హోటల్‌లో గద్దర్ 77వ జయంతి నిర్వహించారు. ప్రజాపోరాటాలే పేదలను దోపిడీవర్గాల నుంచి విముక్తి కలుగుతుందనే ఉద్యమించారన్నారు. అప్పటి ప్రభుత్వాలు గద్దరు ఆటాపాటపై నిషేధం విధించినా ప్రజలు విని దోపిడీదారులపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. దోపిడీవర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిన సాంస్కృతిక సేనానిగా కొనియాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సోమ నాగరాజు, జక్కుల రామచందర్ పాల్గొన్నారు.
డీసీసీ ఆఫీసులో...
జిల్లా కాంగ్రెస్ ఆఫీస్‌లో టీపీసీసీ కో–ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కల్లూరి చందన, నీలి రవీందర్, శరణ్య, రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment