ప్రజలకు అందుబాటులో ఉండాలి
రుద్రంగి(వేములవాడ): వైద్యసిబ్బంది ఎల్లవేళలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ ఉచిత వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. రుద్రంగి మండలం బడితండాలోని పీహెచ్‌సీని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని జాతీయ కార్యక్రమాలపై ఆరోగ్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, డీడీఎం కార్తీక్, వైద్యులు రేఖ తదితరులు ఉన్నారు.
చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో రజిత శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యసిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. పీ హెచ్‌సీ వైద్యాధికారి సంపత్, సిబ్బందిపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment