అమ్మవారి సన్నిధిలో ప్రభుత్వ విప్
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం తిని పించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు.
ఎస్పీని కలిసిన కులబహిష్కరణ బాధితులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలకు చెందిన చెరుకూరి మంజుల–ఎల్లయ్యయాదవ్ అనే దంపతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిశారు. వారు మాట్లాడుతూ తమను అకారణంగా కులం నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేసి కులపెద్దలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు వారు వివరించారు.
ఆర్టీసీ లక్కీ విజేతలకు బహుమతులు
సిరిసిల్లటౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డీప్‌ను శుక్రవారం నిర్వహించారు. సిరిసిల్ల డిపోలో జరిగిన కార్యక్రమంలో విజేతలు ఓ.లత వేములవాడ, కృష్ణవేణి వేములవా డ, స్వాతి సిరిసిల్ల విజేతలుగా నిలిచారు. డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు బహుమతులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment