కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి

Published Sat, Feb 1 2025 12:14 AM | Last Updated on Sat, Feb 1 2025 12:14 AM

కాంగ్

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ప ట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి పేరు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే ఆమోదించినట్లు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికి, పార్టీ మద్దతుతో అభ్యర్థులు పోటీపడతారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నరేందర్‌రెడ్డితో పాటు, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్‌రావు పోటీపడ్డారు. చివరకు ఏఐసీసీ నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనను ప్రకటించినందున ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర మంత్రులు దామోదర రా జనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తన చారిత్రాత్మక గెలుపుతో సోనియాగాంధీకి బహుమతి అందజేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండల కేంద్రంలో నిర్మిస్తున్న హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి మూడు గుంటల స్థలాన్ని ఈదుల రవీందర్‌రెడ్డి అందించారు. అయ్యప్పమాలధారులు సేకరించిన విరాళాలతో ఆలయాన్ని నిర్మించారు. 3, 4, 5వ తేదీల్లో హోమాలు, 7న అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు. గురుస్వాములు రాజు, ఎర్రోజు గోపాలచారి, బిల్లవేణి రఘు, ఈదుల రవీందర్‌రెడ్డి, చక్రధర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, భూపతి పాల్గొన్నారు.

పౌరహక్కుల దినోత్సవం బహిష్కరణ

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాలలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన పౌరహక్కుల దినోత్సవాన్ని గ్రామస్తులు, ప్ర జాసంఘాల నాయకులు బహిష్కరించారు. కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అధికారులే రాకపోతే.. ప్రజలు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకుంటారని ప్రశ్నించారు. నరేశ్‌, సామియేలు, ఎరవెల్లి విజయ్‌, నరేశ్‌, వంశీ, ప్రణీత్‌ ఉన్నారు.

పంట మార్పిడితో లాభం

బోయినపల్లి(చొప్పదండి): రైతులు పంటమార్పిడిలో భాగంగా చెరుకు సాగుచేస్తే లాభదాయకమని జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ కె.మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రైతులతో శాస్త్రవేత్తలు చర్చాగోష్టి నిర్వహించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనస్థానం రుద్రూర్‌ శాస్త్రవేత్తలు రాకేశ్‌, కృష్ణచైతన్య, సాయిచరణ్‌లు చెరుకులో మేలైన రకాలు, వాటి గుణగణాలు, చెరుకుపంట విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన నేలలు, ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, ఏడీఏ రామారావు, ఎంఏవో ప్రణిత, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి ఉన్నారు.

మహాసభలు జయప్రదం చేయండి

సిరిసిల్లటౌన్‌: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉ పాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్‌ హాజరయ్యా రు. ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగే జిల్లా నాలు గో మహాసభలు జయప్రదం చేయాలని కోరా రు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వి ద్యా వ్యతి రేక విధానాలపై ఎస్‌ఎఫ్‌ఐ ఎండగడుతోందన్నారు. మందా అనిల్‌, మల్లారపు ప్రశాంత్‌, జాలపల్లి మనోజ్‌, కుర్ర రాకేశ్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్1
1/2

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్2
2/2

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement