జగిత్యాల
రామగుండం
కొత్తపల్లి
వేములవాడ
పెద్దపల్లి
నిజామాబాద్
సిరిసిల్ల
సిద్దిపేట
ఇవీ డిమాండ్లు..
● దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ, కొండగట్టు, ఓదెల, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను ప్రసాద్ పథకంలో చేర్చాలన్న డిమాండ్ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
● బసంత్‌నగర్‌లో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన అంశం ప్రస్తుత బడ్జెట్‌లో ఉండాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. – వరంగల్ విమానాశ్రయం పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో బసంత్‌నగర్ అంశాన్ని తిరిగి పరిశీలించాలంటున్నారు.
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనిని సిరిసిల్ల, పెద్దపల్లిలకు ట్రిపుల్ ఐటీ, నవోదయ విద్యాలయాలపై ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
● కరీంనగర్ స్మార్ట్‌సిటీకి మరిన్ని నిధులు మంజూరు చేయడం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో అమృత్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయడం.
కరీంనగర్
గజ్వేల్
పెద్దపల్లి బైపాస్‌కు రూ.1000
పెద్దపల్లి– కరీంనగర్ మార్గాన్ని కాజీపేట–బల్లార్షా మార్గంతో కలుపుతున్న పెద్దపల్లి బైపాస్ లైన్‌కు గతంలో కేవలం రూ.1000 కేటాయించారు. గతేడాది చాలా స్వల్ప మొత్తంలో ఇచ్చిన అధికారులు ఈసారి ఎలా కరుణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
● కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్‌కు గతేడాది రూ.5 కోట్లతో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్ ఎస్) పూర్తయ్యింది. ఈసారి బడ్జెట్‌లో ఎంత నిధులు కేటాయిస్తారో చూడాలి.
● పెద్దపల్లి–నిజామాబాద్ రూట్లో గూడ్స్ రైళ్లు బాగా తిరుగుతున్నాయి. ఈ లైన్‌ను డబుల్‌గా మార్చాలన్న డిమాండ్ ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది.
మనోహరాబాద్
బొల్లారం
వికారాబాద్
గతేడాది
ప్రాజెక్టుల
కేటాయింపులు
బీబీనగర్
గతేడాది కేటాయింపులు
ఉమ్మడి జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్ పనుల కోసం గతేడాది కేంద్రం రూ.350 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2016లో కేంద్రాన్ని ఒప్పించింది. రూ. 1,167 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తయి, రైలు సర్వీసులు కూడా మొదలయ్యాయి. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఇప్పటి వరకు 75 కి.మీ పూర్తయ్యింది. ప్రస్తుతం సిరిసిల్ల–సిద్దిపేట (37 కి.మీ) పాటు భూసేకరణ దాదాపు ముగిసింది. ట్రాక్ పనులు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరినాటికి అయినా ప్రాజెక్టు పూర్తి కావాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్‌కు రూ.300 కోట్లు: కాజీపేట– బల్లార్షా మూడోలైన్ రూ.300 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది రూ.450 కోట్లు కేటాయించింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో ఈ లైన్ పూర్తవడం గమనార్హం.
రామగుండం–మణుగూరుకు రూ.5 కోట్లే..: అదే సమయంలో కోల్‌కారిడార్‌గా పిలుస్తున్న రామగుండం (రాఘవాపురం)–మణుగూరు రైల్వేలైన్‌కు ఈసారి నిధులు తగ్గాయి. రామగుండం–మణుగూరు మధ్య ప్రస్తుతం ఉన్న 290 కి.మీలను 200 కి.మీలకు తగ్గించేందుకు భూపాలపల్లి మీదుగా వేస్తున్న ఈలైన్ అంచనా విలువ రూ.3000 కోట్లు. 2022 డిసెంబ రులో ఈ మార్గానికి ప్రధాని మోదీ రామగుండంలో శంకుస్థాపన చేశారు. ఎంతో ఆర్థిక ప్రా ముఖ్యత ఉన్న ఈలైన్‌కు ఇంత తక్కువ కేటా యించడం ఉమ్మడి జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర పౌరులనూ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి బడ్జెట్‌లోనైనా నిధులు పెరుగుతా యా? లేదా అన్నది చూడాలి. బొగ్గు సరుకు రవాణాతోపాటు, పర్యాటక పరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న లైన్ ఇది.
నిర్మలమ్మా..
డిమాండ్‌ను బట్టి తిరుపతి రైలు
కరీంనగర్– తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ చేయాలన్న డిమాండ్ ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి చాలాకాలంగా ఉంది. దీనిపై డిమాండ్‌ను బట్టి చర్యలు తీసుకుంటాం. గతేడాది ఉమ్మడి జిల్లాకు రైల్వే బడ్జెట్‌లో మంచి ప్రాధాన్యం దక్కింది. ఈ సారి కూడా అదే ప్రాధాన్యం దక్కుతుందని ఆశిస్తున్నాం.
– బండి సంజయ్,
కేంద్ర సహాయ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment